గుడ్ న్యూస్.. రాష్ట్రానికి 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో ఎరువుల కొరత వెక్కిరిస్తున్న వేళ కేంద్రం శుభవార్త వినిపించింది....

గుడ్ న్యూస్.. రాష్ట్రానికి 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎరువుల కొరత(Fertilizer shortage) వెక్కిరిస్తున్న వేళ కేంద్రం శుభవార్త వినిపించింది. 10,350 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించింది. అన్ని స్టేట్‌ల కంటే వారం రోజులు ముందుగానే విశాఖ గంగవరం ఎయిర్‌పోర్టు(Visakhapatnam Gangavaram Airport) ద్వారా యూరియా చేరుకోనుంది. ఈ మేరకు కేంద్రం అంగీకరించింది. సెప్టెంబర్ మొదటి వారంలో కాకినాడ పోర్టు(Kakinada port)కు మరో 30 వేల మెట్రిక్ టన్నుల యూరియ దిగుమతి కానుంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. రైతులు(Formers) పలుచోట్ల నార్లు వేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఇప్పటికే నాట్లు వేశారు. అయితే పొలాలకు యూరియా కొరత తీవ్రతరమైంది. దీంతో ఉన్న కొద్ది యూరియా కోసం రైతులు తీవ్ర పాట్లు పడుతున్నారు. దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. అధిక ధరలకు కొంటున్నారు. అయినా యూరియా సరిపోవడంలేదు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి రాష్ట్ర నేతలు తీసుకెళ్లారు. దీంతో యూరియా దిగుమతికి అనుమతించింది.

Next Story