మరింత బలహీనపడిన మొంథా తుపాను

by Vemula.Srinu Prasad |

తెలుగురాష్ట్రాలపై విరుచుకుపడిన మొంథా తుపాను ఎట్టకేలకు మరింత బలహీనపడింది...

మరింత బలహీనపడిన మొంథా తుపాను
X

దిశ, వెబ్ డెస్క్: మూడు రోజులుగా తెలుగురాష్ట్రాల(Telugu States)పై విరుచుకుపడిన మొంథా తుపాను(Montha Cyclone) ఎట్టకేలకు మరింత బలహీనపడింది. వాయుగుండం(Air) నుంచి తీవ్ర అల్పపీడనంగా మారింది. అంతేకాదు విదర్భ పరిసరాల్లో కేంద్రీకృతం అయింది. అయితే ఈ తీవ్ర అల్పపీడడానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ మేరకు ఉత్తర కోస్తా(North coast)కు తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి నాగభూషణం మోస్తారు వర్ష సూచన చేశారు. తెలంగాణ(Telangana)లో ఈ రోజు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. తూర్పు, ఈశాన్య తెలంగాణపై ప్రభావం ఉంటుందని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి నాగభూషణం(Nagabhushanam) పేర్కొన్నారు.

Next Story