రేషన్ షాపుల్లో రూ.20కే కిలో గోధుమపిండి

by Muthe.Rajitha |

ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సందర్భంగా శుభవార్త అందించింది.

రేషన్ షాపుల్లో రూ.20కే కిలో గోధుమపిండి
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సందర్భంగా శుభవార్త అందించింది. రేషన్ దుకాణాల్లో ఇప్పటికే అందిస్తున్న నిత్యావసర సరుకులతో పాటు గోధుమ పిండిని కూడా సబ్సిడీ ధరకు అందించాలని నిర్ణయించింది. కేజీ గోధుమ పిండి కేవలం రూ.20కే ఇవ్వనుండగా.. 2026 జనవరి 1 నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో గోధుమ పిండి ధర కేజీకి రూ.40 నుంచి రూ.80 వరకు ఉండటంతో, ఈ నిర్ణయం పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఆర్థిక ఉపశమనం లభించనుంది.

పౌరసరఫరాల శాఖ ఇప్పటికే పలు జిల్లాలకు రేషన్ సరుకులను తరలిస్తోంది. బియ్యం, చెక్కర, పప్పులతోపాటు ఇకపై గోధుమపిండిని కూడా సబ్సిడీపై అందించటం మరో కీలక ముందడుగుగా భావిస్తున్నారు. రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులు జనవరి నుంచి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది.

Next Story