- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి సమయం ఎంతంటే?
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల చేరుకుని.. భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. అయితే.. వేసవి సెలవులు ముగిసినప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. శ్రీవారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తిరుమల కొండకు చేరుకుంటున్నారు.
ఈ క్రమంలో ఆది, సోమవారాల్లో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పట్టింది. ఈ నేపథ్యంలో నేడు(మంగళవారం) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో శ్రీవారి దర్శనానికి 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న(సోమవారం) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని 84,179 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,036 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.4.72 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు వెల్లడించారు.






