తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి సమయం ఎంతంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-20 03:12:17  IST  )

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి సమయం ఎంతంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల చేరుకుని.. భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొన్ని సార్లు సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది. వేసవి సెలవుల అనంతరం కూడా ఏపీలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

ఈ నేపథ్యంలో నేడు(శుక్రవారం) తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ స్వల్పంగా పెరిగింది. ఈ క్రమంలో ఏటీజీహెచ్‌ వరకు క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న(గురువారం) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని 70,226 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,960 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.4.30 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు వెల్లడించారు.

Next Story