- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నం పెట్టలేదని ఆగ్రహం.. భార్యపై భర్త దారుణ దాడి
పోలవరం జిల్లా దేవీపట్నం మండలం మెట్టగూడెం గ్రామంలో కుటుంబ కలహాలు విషాదకర ఘటనకు దారితీశాయి.

దిశ, దేవీపట్నం: పోలవరం జిల్లా దేవీపట్నం మండలం మెట్టగూడెం గ్రామంలో కుటుంబ కలహాలు విషాదకర ఘటనకు దారితీశాయి. అన్నం పెట్టలేదన్న ఆగ్రహంతో భర్త రాజేంద్ర ప్రసాద్ తన భార్య బాడిస పాపాయమ్మపై కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, ఇంట్లో జరిగిన చిన్నపాటి వాగ్వాదం క్రమంగా తీవ్రస్థాయికి చేరడంతో క్షణికావేశానికి లోనైన రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో ఉన్న కొడవలితో భార్య కడుపు భాగంలో దాడి చేసినట్లు తెలిసింది. తీవ్ర రక్తస్రావంతో పాపాయమ్మ అక్కడికక్కడే కుప్పకూలగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెంటనే స్పందించి ఆమెను గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న దేవీపట్నం పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






