- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీ బస్సులో గొడవ.. పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు
ఆర్టీసీ బస్సులో సీటు కోసం గొడవ ఇద్దరు మహిళలు పొట్టు పొట్టు కొట్టుకున్నారు..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఫ్రీ బస్సు పథకం(Free Bus Scheme) కొనసాగుతోంది. టికెట్‌కు డబ్బులు లేకుండా ఉచితంగా మహిళలు(Women) ప్రయాణిస్తున్నారు. అయితే కొన్ని సమయాల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. బస్సులో సీటు కోసం కొందరు మహిళలు గొడవ పడుతున్నారు. తమదంటే తమదే అంటూ ఘర్షణ పడుతున్నారు. జుట్టు పట్టుకుని మరీ కొట్టుకుంటున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఫ్రీ బస్సు పథకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉచిత ప్రయాణం వల్లే బస్సుల్లో ఇలా జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాజాగా కూడా బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు పొట్టుపొట్టు కొట్టుకున్నారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District) జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం(Lakkavaram)లో జరిగింది. లక్కవరం బస్టాండ్‌లో బస్సు ఆగింది. దీంతో మహిళా ప్రయాణికులు హడావుడిగా బస్సు ఎక్కారు. ఇద్దరు మహిళా ప్రయాణికులు మాత్రం గొడవ పడ్డారు. సీటు కోసం ఘర్షణ పడ్డారు. జుట్టు పట్టుకుని మరీ కొట్టుకున్నారు. పక్క వాళ్లు ఆపుతున్నా బూతులు తిట్టుకుంటూ దెబ్బలాడుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






