- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News:పోలవరం సమస్య పై మంత్రి నాదెండ్ల కీలక హామీ
పోలవరం ప్రాజక్టుకు భూములందించిన ప్రతి నిర్వాసితుడికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందేట్లు చూస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి , ఏలూరు జిల్లా ఇంఛార్జ్ నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు.

దిశ ప్రతినిధి, ఏలూరు: పోలవరం ప్రాజక్టుకు భూములందించిన ప్రతి నిర్వాసితుడికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందేట్లు చూస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి , ఏలూరు జిల్లా ఇంఛార్జ్ నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. ఏలూరు కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో గురువారం జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వల్ల భూములు కోల్పో భూములు కోల్పోయిన పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు, మండలాల్లో గ్రామ సభలు జరిపి , వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించామన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సొమ్ము అందించిన నిర్వాసితులను వారికి మంజూరు చేసిన కాలనీలలో నివాసయోగ్యంగా ఉండేందుకు త్రాగునీరు, విద్యుత్, రోడ్లు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాలు పూర్తిగా అందించాలని ఆదేశించామన్నారు.
జిల్లాను వ్యవసాయకంగానూ, పారిశ్రామికంగానూ అభివృద్ధి పథంలో నిలిపేలా ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం అన్ని మండలాల్లో అందుబాటులో ఉన్న 1600 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి ల్యాండ్ బ్యాంక్ ను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. పరిశ్రమలు నెలకొల్పే పారిశ్రామికవేత్తలకు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన అంశాలపై అవగాహన కలిగించి, పెట్టుబడిదారులు జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేలా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక టీం , మార్చ్, 15వ తేదీలోగా విధివిధానాలు రూపొందిస్తుందన్నారు.
ఏలూరు జిల్లాలోని కొల్లేరు ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. . 5వ కాంటూర్ లో అటవీ, జిరాయితీ భూముల సరిహద్దులను అటవీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సమన్వయంతో నిర్దారించాలని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి మ్యాప్ లను సిద్ధం చేయాలని ఆదేశించామన్నారు. కొల్లేరులో 14 వేల ఎకరాల జిరాయితీ భూమిదారుల సమస్యలకు సంబంధించి సమగ్ర సమాచారంతో, కొల్లేరు సమస్యల పై బడ్జెట్ సమావేశాల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో చర్చిస్తామన్నారు. జిల్లాలో గుంతల రోడ్లను ఈనెలాఖరులోగా మరమ్మత్తులు చేయాలనీ, పెండింగ్ నిర్మాణ పనులను మార్చ్, 31 లోగా పూర్తి చేయాలని ఆదేశించామన్నారు.






