- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News : జగన్ ఫోటోలు బయట పడేస్తాం : టీడీపీ ఎమ్మెల్యేలు
ప్రభుత్వ కార్యాలయాల్లో జగన్ ఫోటోలు(YS Jagan) ఉంటే బయట పడేస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు(TDP MLAs) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రభుత్వ కార్యాలయాల్లో జగన్ ఫోటోలు(YS Jagan) ఉంటే బయట పడేస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు(TDP MLAs) సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లాలోని మడకశిర నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు(TDP MLA MS Raju) ప్రభుత్వ కార్యాలయాల్లో మాజీ సీఎం జగన్ ఫోటోలను తొలగించాలని, లేదంటే చింపి బయట పారేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అనంతపురం జడ్పీ సమావేశంలో(Anantapuram ZP Meeting) వైసీపీ నేతలు, జడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ ఛాంబర్‌లో జగన్ ఫోటోలు ఉంచడంపై టీడీపీ ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్ర బాబు, దగ్గుబాటి వెంకట ప్రసాద్, ఎంఎస్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో స్టోర్ రూమ్ పక్కన ఉంచగా, గిరిజమ్మ ఛాంబర్‌లో జగన్ ఫోటో ప్రముఖంగా కనిపించడంతో ఎమ్మెల్యేలు అధికారులపై, జడ్పీ సీఈఓపై మండిపడ్డారు. ఈ ఘటనలో జడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మను అవమానించినట్లు వచ్చిన ఆరోపణలను ఎంఎస్ రాజు ఖండించారు. తాము గిరిజమ్మను గౌరవించామని, కేవలం ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రోటోకాల్ పాటించాలని డిమాండ్ చేశామని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు ఈ చర్యను రాజకీయ కక్షసాధింపుగా విమర్శిస్తూ, టీడీపీ ఎమ్మెల్యేలు అధికారులను, సిబ్బందిని బెదిరించారని ఆరోపించారు.






