- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan kalyan: 15 ఏళ్లు కలిసే ఉంటాం... తేల్చి చెప్పిన పవన్
మరో పదిహేనేళ్లపాటు తమ కూటమి కలిసే ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పవన కల్యాణ్ తేల్చి చెప్పారు

దిశ, డైనమిక్ బ్యూరో : మరో పదిహేనేళ్లపాటు తమ కూటమి కలిసే ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పవన కల్యాణ్(Pawan kalyan) తేల్చి చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో ఆయన ఈ రోజు శాసనసభలో(ap assembly) మాట్లాడారు. గవర్నర్‌ను గౌరవించే విధానం ఇదేనా అని ఆయన వైసీపీని ఉద్దేశించి ప్రశ్నించారు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలకే విబేధాలు ఉంటాయన్నారు. అలాంటిది రెండు మూడు పార్టీలు కలిసి ఉంటే అభిప్రాయ బేధాలు రావచ్చాన్నరు. అయి కానీ ప్రజల కోసం, వైసీపీని అసెంబ్లీలో అడుగుపెట్టనీయకుండా ఉండడం కోసం తాము కలిసే ఉంటామన్నారు. ఏపీ ప్రజల కోసం నిలబడతామన్నారు. టీటీడీ తొక్కిసలాట ఘటన జరిగినపుడు తాను క్షమాపణ చెప్పానని ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీలో అధికార పక్షం మేమే.. ప్రతిపక్షం కూడా మేమే అన్నారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా కావాలనుకుంటే జర్మనీ వెళ్లామని మరోసారి సూచించారు. అక్కడ ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇస్తారని అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంటుకు నిధులు ఇచ్చినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababi) సూచనలతో తామంతా ముందుకు వెళతామన్నారు. సీఎం కృషి వల్లే విశాఖ ఉక్కు(vizag steel) పరిశ్రమను రక్షించుకున్నామన్నారు. గత ప్ఱభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంటులో ప్లాట్లు వేసేందుకు సిద్ధం అయిందన్నారు. 2047 నాటికి ఏపీని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేందుకు అంతా కలిసి కృషి చేస్తామన్నారు.






