- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ. 1081 కోట్లతో రాష్ట్రాన్ని గుంతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాము
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 నెలల కాలంలోనే రూ. 1081 కోట్లతో

దిశ, వెబ్ డెస్క్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 నెలల కాలంలోనే రూ. 1081 కోట్లతో రాష్ట్రాన్ని రహదారులపై గుంతలు (Potholes) లేని రాష్ట్రంగా తీర్చిదిద్దామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి (BC Janardhan Reddy) అన్నారు. ఆదివారం జరిగిన ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APRDC) సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలోని రహదారులు దెబ్బతిన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రోడ్లు, భవనాల శాఖపై ప్రజల్లో సానుకూలత ఏర్పడిందన్నారు. రాయలసీమ ప్రాంతంలో కొంత మేర రహదారులు బాగానే ఉన్నప్పటికీ.. ఉత్తరాంధ్ర, కోస్తా, కృష్ణ, గుంటూరు జిల్లాలో రహదారులు ఎక్కువగా దెబ్బతిన్నాయని పేర్కొ్న్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) నాయకత్వంలో రోడ్లకు నేడు మహర్దశ వచ్చిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాదాపు రూ. 2500 కోట్ల మేర రహదారుల అభివృద్ధి పనులు చేపట్టామని తెలియజేశారు. త్వరలోనే మరో రూ.1000 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నాం అన్నారు. ముఖ్యమంత్రి అనునిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ఎన్డీబి, నాబార్డ్ వంటి బ్యాంకుల సహకారంతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రజలపై భారం పడకుండా పీపీపీ మోడల్ లో రహదారులను అభివృద్ధి చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. పార్టీ కోసం శ్రమించి, అధికారంలోకి రావడానికి కారణమైన కూటమి నాయకులు, కార్యకర్తలు సేవలను గుర్తించి కార్పొరేషన్ సభ్యులుగా ఎంపిక చేయటం జరిగిందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఏపీ ఆర్టీసీ చైర్మన్ ప్రగడ నాగేశ్వర రావు, ఎండీ ఎల్.శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు.






