AP Govt: ‘అర్హులందరికీ ఇళ్లు ఇస్తాం’.. మంత్రి కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే(State Development) లక్ష్యంగా ముందుకెళ్తోందని మంత్రి కొలుసు పార్థసారథి(Minister Kolusu Parthasarathi) తెలిపారు

AP Govt: ‘అర్హులందరికీ ఇళ్లు ఇస్తాం’.. మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే(State Development) లక్ష్యంగా ముందుకెళ్తోందని మంత్రి కొలుసు పార్థసారథి(Minister Kolusu Parthasarathi) తెలిపారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో మంత్రి పార్థసారథి గత వైసీపీ(YSRCP) ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ రోజు(శనివారం) విజయవాడ(Vijayawada)లో మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. అర్హులందరికీ ఇళ్లు ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో రూ.వేల కోట్లు దారి మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం పేదలకు ఇళ్లను నిర్మించాలనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తుందని అన్నారు. మా ప్రభుత్వం వచ్చాక 1.14 లక్షల ఇళ్లు నిర్మించామని మంత్రి తెలిపారు. తేతలి గ్రామంలో ఫిబ్రవరి 1న సీఎం చంద్రబాబుకు ఇళ్లు అప్పగిస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. గృహ నిర్మాణానికి ఆర్నెళ్లలో రూ. 502 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా.. రూ.502 కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు. పీఎంఎవై రెండో విడతలో మరో 6 లక్షల ఇళ్లు పూర్తి చేశామని మంత్రి పార్థసారథి తెలిపారు.

Next Story