- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజధాని రైతులకు న్యాయం చేస్తాం : మంత్రి నారాయణ
రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేస్తామని రాష్ట్ర పురపాలక, పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేస్తామని రాష్ట్ర పురపాలక, పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) అన్నారు. రాజధానిలోని వెంకటపాలెం, ఉద్దండరాయుని పాలెం పర్యటించిన ఆయన అంగన్వాడీ, హెల్త్ సెంటర్లు, స్కూల్స్ భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరావతిలో (Amaravathi) సిటీస్ ప్రాజెక్ట్ క్రింద 15 అంగన్వాడీ భవనాలు, 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాలు, 14 పాఠశాలలు, ఒక మల్టీ పర్పస్ శ్మశాన వాటికను నిర్మించామని పేర్కొన్నారు. వాటి ద్వారా రాజధాని పరిధిలోని గ్రామాల్లో నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలు అందుతాయని తెలిపారు.
కొందరు రైతులు తమకు కావలసిన చోట ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతున్నారన్నారు. అంతేకాకుండా కొందరు సోషల్ మీడియాలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు ఎవరికి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. రైతులకు ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రానున్న మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయని ప్రకటించారు. మొత్తం 69,421 మంది రైతులకు ఇప్పటి వరకు 61,433 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని చెప్పారు. మరో 2,270 మంది రైతులకు 7,988 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందన్నారు. రోజుకు సగటుగా 30 నుంచి 40 వరకు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని వెల్లడించారు. మొత్తం 30, 635 మంది రైతుల్లో 29,644 మందికి ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని తెలిపారు. ఇంకా 991 మందికి కేటాయింపులు జరగాల్సి ఉందన్నారు.






