air raid siren sounds : మీడియా చానళ్లలో.. ఆ సైరన్లు వద్దు..

by Thanuru Gopichand |   (  Updated:2025-05-10 09:52:18  IST  )

మీడియా చానల్స్​లో వైమానిక దాడికి సంబంధించిన సైరన్లు వినిపించవద్దంటూ భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్​ హోం ఎఫైర్స్​ఈ రోజు ఆదేశాలను జారీ చేసింది.

air raid siren sounds : మీడియా చానళ్లలో.. ఆ సైరన్లు వద్దు..
X

మినిస్ట్రీ ఆఫ్​ హోం ఎఫైర్స్ ​కీలక ఆదేశాలు

దిశ, డైనమిక్​బ్యూరో : మీడియా చానల్స్​లో వైమానిక దాడికి సంబంధించిన సైరన్లు వినిపించవద్దంటూ భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్​ హోం ఎఫైర్స్​ఈ రోజు ఆదేశాలను జారీ చేసింది. అదే పనిగా సైర్లన్లు మోగినట్లు వినిపించడం ద్వారా సామాన్యం ప్రజల్లో యుద్ధంపై ఉన్న సున్నితత్వం తగ్గింపోతుందన్నారు. ప్రజలు గందరగోళానికికూడా గురవుతారని పేర్కొంది. నిజమైన సైరన్లు మోగినపుడు ప్రజలు వెంటనే పోల్చుకోలేకపోతారని.. దీంతో అటువంటి మోతలు ఆపివేయాలని సూచించారు. యుద్ధంపై ప్రజల్లో సన్నద్ధత కల్పించేందుకు మినిస్ట్రీ హోం ఎఫైర్స్​ తగు చర్యలను చేపడుతుందని, దానికి మీడియా సహకరించాలని కోరింది. భారత్​, పాకిస్తాన్​సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో రెండు రోజులుగా కొన్ని టీవీ, యూట్యూబ్​చానళ్లు అదే పనిగా సైరన్లను మోగిస్తూ వార్తలు ప్రసారం చేస్తున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు హోం ఎఫైర్స్​శాఖ తాజాగా ఆదేశాలను జారీ చేసింది.

Next Story