యాంటీ బెట్టింగ్ పాలసీ‌కి కృషి చేస్తున్నాం.. అన్వేష్ ట్వీట్ కు స్పందించిన మంత్రి లోకేష్

by Ramesh Goud |

గోవిందా అనే బెట్టింగ్ యాప్ పై ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ (You Tuber Anvesh) చేసిన ట్వీట్ కు ఏపీ మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) స్పందించారు.

యాంటీ బెట్టింగ్ పాలసీ‌కి కృషి చేస్తున్నాం.. అన్వేష్ ట్వీట్ కు స్పందించిన మంత్రి లోకేష్
X

దిశ, వెబ్ డెస్క్: గోవిందా అనే బెట్టింగ్ యాప్ పై ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ (You Tuber Anvesh) చేసిన ట్వీట్ కు ఏపీ మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) స్పందించారు. ప్రముఖ తెలుగు ట్రావెలర్, యూట్యూబర్ అన్వేష్ బెట్టింగ్ యాప్‌ల నిర్మూలనే లక్ష్యంగా సోషల్ మీడియా వేదికగా ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. అన్వేష్ చొరవతో పలువురు సెలబ్రెటీల మీద కేసులు కూడా అయ్యాయి. ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపనని చెబుతూ.. బెట్టింగ్ యాప్స్ నిర్మూలనకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అన్వేష్ ఎన్నో వీడియోలు చేసి, సోషల్ మీడియా (Social Media)లో పోస్ట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి పేరుతో గోవిందా (Govinda) అనే బెట్టింగ్ యాప్ (Betting App) ను నడిపిస్తున్నారని, దీనిపై మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyana) స్పందించి, చర్యలు తీసుకోవాలని అన్వేష్ కోరారు. అన్వేష్ ట్వీట్ పై స్పందించిన నారా లోకేష్.. బెట్టింగ్ యాప్స్ నిర్మూలనపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా లోకేష్.. బెట్టింగ్ యాప్‌లు జీవితాలను నాశనం చేస్తున్నాయని, ఇలాంటి జూదాలకు అలవాటు పడి, వందల మంది యువకులు నిరాశతో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్న ఘటనలు ఎన్నో వింటున్నానని తెలిపారు. ఇది పూర్తిగా ఆగిపోవాలని, దీని కోసం బెట్టంగ్ యాప్స్ పై నిరంతర అవగాహనతో పాటు కఠిన చర్యలు తీసుకోవడం లాంటివి దీర్ఘకాలిక పరిష్కారం చూపిస్తాయని చెప్పారు.

ఇక సమగ్ర బెట్టింగ్ నిరోధక విధానం (Comprehensive anti-betting policy) తీసుకొచ్చి దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచే విధంగా తాము కృషి చేస్తున్నామని, ఈ ముప్పును అంతం చేయడానికి అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తున్నామని మంత్రి వివరించారు. కాగా బెట్టింగ్ దేవుడి పేరుతో ఉన్న బెట్టింగ్ వెబ్ సైట్ విషయంలో యూట్యూబర్ అన్వేష్.. మంత్రివర్యులు నారా లోకేష్ కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి పవిత్రమైన వెంకటేశ్వర స్వామి పేరుతో గోవిందా అనే బెట్టింగ్ యాప్ ని కొన్ని సంవత్సరాలుగా పేరు మోసిన సినీ తారలు చాలామంది ప్రముఖులు, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వెబ్ సైట్ లలో ఈ రోజు వరకు నడిపిస్తున్నారని, అమాయకమైన యువతను వీటి నుండి కాపాడాల్సిందిగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

Next Story