‘జూన్ 4న వెన్నుపోటు దినంగా నిర్వహిస్తున్నాం’.. వైసీపీ నేత సెన్సేషనల్ కామెంట్స్

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-30 10:59:37  IST  )

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) పై వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘జూన్ 4న వెన్నుపోటు దినంగా నిర్వహిస్తున్నాం’.. వైసీపీ నేత సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) పై వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెల(జూన్) 4వ తేదీన కూటమి అరాచక పాలన పై వెన్నుపోటు దినంగా నిర్వహిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇవాళ(శుక్రవారం) తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, నేతలు ‘వెన్నుపోటు దినం’ పోస్టర్ రిలీజ్ చేశారు.

అనంతరం సజ్జల మాట్లాడుతూ.. రాష్ట్రం(Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 4వ తేదీతో ఏడాది అవుతున్న ఒక్క హామీ కూడా నెరవేర్చ లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎప్పుడు అమలు చేస్తారని ఆయన ప్రశ్నించారు.

ఈ క్రమంలో ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఫైరయ్యారు. ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు ఇచ్చి.. వాటి అమలును మరిచారని విమర్శలు గుప్పించారు. ఎన్డీయే కూటమి ఎన్నికల సమయంలో సాధ్యం కాని హామీలు అమలు చేస్తామని ప్రగల్భాలు పలికారని దుయ్యబట్టారు. అప్పుడు మామకు వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు ప్రజలకు స్ట్రెయిట్ పోటు పొడిచారని సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు.

Next Story