Vizianagaram : కన్న తండ్రిని కడతేర్చిన తనయుడి అరెస్ట్

by Thanuru Gopichand |   (  Updated:2025-11-04 09:16:46  IST  )

మద్యం మత్తులో కన్నతండ్రిని కడతేర్చాడు ఓ తనయుడు. రక్త బంధాన్ని మరిచి మరీ దారుణానికి ఒడిగట్టాడు.

Vizianagaram : కన్న తండ్రిని కడతేర్చిన తనయుడి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : మద్యం మత్తులో కన్నతండ్రిని కడతేర్చాడు ఓ తనయుడు. రక్త బంధాన్ని మరిచి మరీ దారుణానికి ఒడిగట్టాడు. మద్యానికి బానిసై మానవత్వం మరచిన రాక్షసుడిలా మారాడు ఆ తనయుడు. వివరాల్లోకి వెళ్లే విజయనగరం జిల్లా, బాడండి మండలం, గొల్లాది గ్రామంలో రాము అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నాడు. మద్యానికి బానిసైన అతను తరచూ ఇంట్లో వారితో గొడవపడుతూ ఉండేవాడు. నిత్యం భార్యను హింసిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం మద్యం తాగి ఇంటికి వచ్చాడు రాము. మద్యం మత్తులో ఉన్న రాముతో అతని తండ్రికి గొడవైంది. ఇద్దరి మధ్య వివాదం రేగడంతో పదునైన వస్తువుతో కన్న తండ్రిని రాము హతమార్చాడు. దీంతో బాడంగి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడైన రామును అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ భవ్య రెడ్డి వెల్లడించారు. కేసును సీఐ నారాయణ రావు, ఎస్ఐ తారకేశ్వర రావు విచారించినట్లు డీఎస్పీ తెలిపారు.

Next Story