- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్ కోసమే చేశా..విచారణలో శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్ !
వైయస్ జగన్మోహన్ రెడ్డి ( YS Jaganmohan Reddy) అలాగే కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసింది వివాదాస్పద నటి శ్రీ రెడ

దిశ, వెబ్ డెస్క్: వైయస్ జగన్మోహన్ రెడ్డి ( YS Jaganmohan Reddy) అలాగే కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసింది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి (Sri Reddy). వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసమే సీఎం చంద్రబాబు నాయుడు ( CM Chandrababu Naidu) అలాగే పవన్ కళ్యాణ్ ను ( Pawan Kalyan) ఉద్దేశించి అసభ్యకర పోస్టులు పెట్టినట్లు విచారణలో శ్రీరెడ్డి ఒప్పుకుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లపై ( Nara Lokesh ) అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో ఇవాళ విచారణకు శ్రీ రెడ్డి హాజరయ్యారు.
విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు శ్రీ రెడ్డి. ఈ సందర్భంగా విచారణలో కీలక విషయాలను వెల్లడించారు శ్రీ రెడ్డి. సోషల్ మీడియాలో తాను చేసిన పోస్టులు అన్ని తన వ్యక్తిగతం... అంటూ ప్రకటించారు శ్రీ రెడ్డి. వైసిపి అలాగే వైయస్ జగన్మోహన్ పై ఉన్న అభిమానంతోనే... కూటమి నేతలపై పోస్టులు పెట్టినట్లు వెల్లడించారు. పోస్టులకు సంబంధించిన నాపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని వివరించారు. జగన్మోహన్ రెడ్డి పై అభిమానంతోనే... గతంలో పోస్టులు పెట్టినట్లు క్లారిటీ ఇచ్చారు. మరోసారి కూడా... విచారణకు పిలిస్తే రావాలని ఈ సందర్భంగా శ్రీ రెడ్డికి (Sri Reddy) సమాచారం ఇచ్చారు పోలీసులు.
ఇది ఇలా ఉండగా... వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీ రెడ్డి తో పాటు పోసాని కృష్ణ మురళి, రాంగోపాల్ వర్మ కూడా రెచ్చిపోయి కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రాంగోపాల్ వర్మ.. కోర్టును ఆశ్రయించి ఎస్కేప్ అయ్యారు. కానీ పోసాని కృష్ణమురళి మాత్రం ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయనకు బెయిల్ మంజూరు కావడంతో బయటకు కూడా వచ్చారు.






