రాజధాని అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం : రామ్మోహన్ నాయుడు భరోసా

by Ramesh Naini |

అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భరోసా ఇచ్చారు.

రాజధాని అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం : రామ్మోహన్ నాయుడు భరోసా
X

దిశ, డైనమిక్ బ్యూరో : అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భరోసా ఇచ్చారు. శనివారం రాజమహేంద్రవరంలో కూటమి NDA నాయకులతో కలిసి కేంద్ర బడ్జెట్ 2026-27 పై మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా, అన్ని రాష్ట్రాల అవసరాలను సమతుల్యంగా పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ప్రజా కేంద్రిత బడ్జెట్ ఇదన్నారు. తయారీ, సేవలు, రక్షణ, వ్యవసాయం, లాజిస్టిక్స్ వంటి కీలక రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యం స్థిరమైన వృద్ధి, ఉపాధి అవకాశాల గురించి మీడియాతో మాట్లాడారు.

రేర్ ఎర్త్ కారిడార్, రైల్వే మౌలిక వసతులు

పౌర విమానయానాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర బడ్జెట్ 2026-27 లో ప్రధానంగా MRO రంగాన్ని బలోపేతం చేయడం, ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడం, పర్యాటకం, వ్యాపార వృద్ధికి మద్దతు ఇవ్వడం వంటి చర్యలపై ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ దృష్టికోణంలో కేంద్ర ప్రభుత్వ సహకారం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉందన్నారు. అమరావతి అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు, రేర్ ఎర్త్ కారిడార్, రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి లభిస్తున్న మద్దతు దీర్ఘకాలిక ఆర్థిక ప్రగతి, కనెక్టివిటీకి బలాన్నిస్తోందని తెలిపారు. భారత దేశ అభివృద్ధి పథాన్ని మరింత బలపరిచే చారిత్రాత్మక బడ్జెట్‌ను అందించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Next Story