ఎన్నికల్లో అక్రమాల అడ్డుకట్టకు ‘సీ-విజిల్’ యాప్

by Disha Web Desk 18 |
ఎన్నికల్లో అక్రమాల అడ్డుకట్టకు ‘సీ-విజిల్’ యాప్
X

దిశ ప్రతినిధి,విజయవాడ:ఎన్నికల్లో అక్రమాలకు,నిబంధనలకు ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం‘సీ-విజిల్’ యాప్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ యాప్ తో ఎన్నికల్లో అవినీతికి చెక్ పెట్టడానికి ఎన్నికల సంఘం ఓటర్లకు బ్రహ్మాస్త్రాన్ని రెడీ చేసిందనే చెప్పవచ్చు.కొందరు అభ్యర్థులు డబ్బు, మద్యం ఎరగా చూపి అడ్డాదారిలో గెలుపోందెందుకు ప్రయత్నిస్తారు.అవినీతి జరగకుండా ఈ యాప్ ఉపయోగపడుతోంది.

ఈ యాప్ పోలీసు కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేసి ఉంటుంది.ఎన్నికల ఉల్లంఘనలపై సాక్ష్యాలతో సహా అందులో పొందుపరచవచ్చు. ఫొటో, వీడియో లేదా ఆడియో రూపంలో రికార్డ్ చేసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఫిర్యాదు చేసిన 5 నిమిషాల్లో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు.దీనిపై విచారణ చేపట్టిన 100 నిమిషాల్లో సదరు ఫిర్యాదుపై కచ్చితమైన చర్యలు తీసుకుంటారు.

Next Story

Most Viewed