అమరావతిలో మరో ఎయిర్ పోర్టు.. ఏపీ మంత్రి నారాయణ కీలక ప్రకటన

by velandi.Saikiran |   (  Updated:2025-04-15 09:57:46  IST  )

ఆంధ్ర ప్రదేశ్ (AP) రాష్ట్ర మంత్రి నారాయణ ( Narayana) కీలక ప్రకటన చేశారు. అమరావతి లో ( Amaravati ) మరో ఎయిర్ పోర్ట్ (

అమరావతిలో మరో ఎయిర్ పోర్టు.. ఏపీ మంత్రి నారాయణ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్ర ప్రదేశ్ (AP) రాష్ట్ర మంత్రి నారాయణ ( Narayana) కీలక ప్రకటన చేశారు. అమరావతి లో ( Amaravati ) మరో ఎయిర్ పోర్ట్ ( Airport ) రాబోతుందని మంత్రి నారాయణ తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు. ఇవాళ మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడారు. రాజధాని అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ( International Airport) నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నామని... ఈ సందర్భంగా ప్రకటించారు. భవిష్యత్తులో మంగళగిరి, విజయవాడ, గుంటూరు, తాడేపల్లి కలిసి ఓ మెగా సిటీగా మారిపోతాయని అంచనా వేశారు మంత్రి నారాయణ ( Narayana).

అందుకే... అమరావతి రాజధానిలో కొత్తగా మరో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ మేరకు... ఆదేశాలు కూడా వచ్చాయన్నారు. ఈ ఎయిర్ పోర్టు కోసం.. ఏకంగా ఐదు వేల ఎకరాలు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నట్లు ప్రకటించారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా 40,000 ఎకరాల వరకు... సమీకరించాలన్నారు మంత్రి నారాయణ. ఇక అమరావతిలో మరో ఎయిర్ పోర్టు విషయం పై అతి త్వరలోనే కీలక విషయాలను ప్రకటిస్తామని కూడా... స్పష్టం చేశారు మంత్రి నారాయణ ( Narayana).

అలాగే అమరావతి రాజధాని నిర్మాణ పనులు కూడా చక చక.. ముందుకు సాగుతున్నాయని వివరించారు. అమరావతిని ప్రపంచ స్థాయిలో... తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నిత్యం కృషి చేస్తున్నారని వెల్లడించారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల అమరావతి రాజధాని వెనుకబడిందని... ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత దూసుకు వెళ్తుంది అన్నారు.

Next Story