అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్

by velandi.Saikiran |   (  Updated:2025-04-09 15:53:53  IST  )

అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం పోతంగి

అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: అడవి తల్లి బాట (Adavi Thalli Bata) కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( AP Deputy CM Pawan Kalyan ). అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామంలో జన్ మన్ పథకం కింద మంజూరైన రహదారులకు శంకుస్థాపన చేశారు. పెదపాడు గ్రామంలో గడ్డపార పట్టి భూమి పూజ చేసిన పవన్ కళ్యాణ్... అనంతరం పెదపాడు గ్రామస్తులతో సమావేశమయ్యారు.

అలాగే అంగన్వాడి కేంద్రంలో గర్భిణులకు కిట్లను పంపిణీ చేసారు పవన్ కళ్యాణ్. గ్రామంలోని చిన్నారులకు తనతో తెచ్చిన స్వీట్ బాక్సు లను అందించారు పవన్ కళ్యాణ్. అలాగే గ్రామస్తుల ముఖాముఖిలో గ్రామస్తులు అడిగిన 12 సమస్యలను ఆరు నెలల్లోపు పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. అనంతరం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

జన్ మన్ పథకం ( Janman Scheme ) కింద అల్లూరి ఏజెన్సీకి 16.7 KM రోడ్లు మంజూరయ్యాయని చెప్పారు పవన్ కళ్యాణ్. మీ గ్రామానికి మరింత సదుపాయాలను సమకూర్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. మీతో పాటు నడిచి మీ కష్టాన్ని చూశాను కనుకనే, ఈ రహదారులను పోరాడి సాధించామని వెల్లడించారు పవన్ కళ్యాణ్. ఈ నియోజకవర్గంలో మాకు ఓటు వేయకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( Chief Minister Chandrababu Naidu ), నేను చర్చించుకుని ఈ రహదారులను మంజూరు చేయించామన్నారు.

Next Story