నేటి నుంచి ఉచిత మెగా మెడికల్ క్యాంపు

by Disha Web Desk 18 |
నేటి నుంచి ఉచిత మెగా మెడికల్ క్యాంపు
X

దిశ,ఉక్కు నగరం:నగరం లోని విశాఖ స్టీల్ జనరల్ హాస్పిటల్ లో శనివారం నుంచి రెండు రోజుల పాటు ఉచిత మెగా మెడికల్ క్యాంపు ను నిర్వహిస్తున్నట్లు లీ ఫార్మా లిమిటెడ్ , జె.సి ఐ ( విశాఖ స్టీల్ సిటీ ) ప్రతినిధులు తెలిపారు. లీ ఫార్మా లిమిటెడ్, జె.సి. ఐ సంయుక్త నిర్వహణలో బోన్, జాయింట్ కీళ్ల నొప్పుల కు మెరుగైన వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స నిర్వహిస్తామని తెలిపారు. కీళ్ల నొప్పుల వ్యాధులతో పాటు వివిధ వ్యాధులకు పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. ఈ మెడికల్ క్యాంప్ ఉక్కు జనరల్ హాస్పిటల్ లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని , ఈ అవకాశాన్ని ఉక్కు కుటుంబాలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు వెల్లడించారు.


Next Story

Most Viewed