- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Visakha: టీడీపీ, జనసేన పొత్తుపై బీజేపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీలో టీడీపీ, జనసేన పొత్తుపై బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు కీలక వ్యాఖ్యలు చేశారు...

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ, జనసేన పొత్తుపై బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలు కలిస్తే ఏపీ ప్రజలకు చాలా మంచి జరుగుతుందని ఆయన తెలిపారు. విశాఖలో విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడారు. రాక్షస రాజ్యం నుంచి సుపరిపాలనకు ప్రజలు శ్రీకారం చుట్టారన్నారు. సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి రాకుండా పార్టీలన్నీ కలవాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వైసీపీలో నీచమైన వ్యక్తులున్నారని, అసలు గోరంట్ల మాధవ్‌కు బుద్ధి ఉందా అని ప్రశ్నించారు. శత్రువును కూడా వ్యక్తిగతంగా విమర్శించకూడదని విష్ణుకుమార్‌రాజు సూచించారు.
అటు పురంధేశ్వరిపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను సైతం విష్ణుకుమార్ రాజు ఖండించారు. ఏపీలో లిక్కర్ స్కామ్ చాలా పెద్దదని తెలిపారు. పురంధేశ్వరిపై మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని విష్ణుకుమార్ రాజు హితవు పలికారు.






