- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP | అల్లూరి జిల్లాలో వణుకు పుట్టిస్తోన్న చలి
అల్లూరి జిల్లాలో చలి (Cold) పులి తన పంజా విసరడం ప్రారంభించింది. ప్రజలకు చల్లదనంతో వణుకు పుట్టిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : అల్లూరి జిల్లాలో చలి (Cold) పులి తన పంజా విసరడం ప్రారంభించింది. ప్రజలకు చల్లదనంతో వణుకు పుట్టిస్తోంది. సుమారు 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్టోగ్రతలు (Temperature) నమోదు అవుతోంది. జిల్లా పరిధిలోని మినుమలూరులో (Minumuluru) 10 డిగ్రీలు, పాడేరులో 12 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ప్రజలు చలి దెబ్బకు వణికిపోతున్నారు. ఏజెన్సీ వ్యాప్తంగా పొగ మంచు కమ్మేయడంతో మంచు తెరలను చీల్చుకుంటూ ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఏజెన్సీ ప్రాంతం కావడంతో మంచు అందాలు ఇక్కడకు వచ్చే పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. వంజంగిలోని మేఘాలకొండలో (Meghala Konda) దర్శనమిస్తున్న మంచు దృశ్యాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చలి ప్రభావం ఎక్కవ ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చలి కారణంగా ఆరోగ్య సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున, చలి నుంచి తమను తాము కాపాడుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.






