- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనకాపల్లి | క్రేన్ లిఫ్ట్ బకెట్ పడి ఉపాధ్యాయురాలు మృతి
అనకాపల్లి (Anakapalli) జిల్లాలో ఘోరం జరిగింది. క్రేన్ ప్రమాదానికి గురై ఓ ఉపాధ్యాయురాలు తన ప్రాణాలను కోల్పోయారు.

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి (Anakapalli) జిల్లాలో ఘోరం జరిగింది. క్రేన్ ప్రమాదానికి గురై ఓ ఉపాధ్యాయురాలు జ్యోష్నా భాయి తన ప్రాణాలను కోల్పోయారు. పోలీసుల వివరాల ప్రకారం పాయకరావుపేట మండలంలోని రాజానగరం ప్రభుత్వ పాఠశాలలో (Rajanagaram Govt School) కళావేదిక నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అక్కడకు స్లాబ్ నిర్మాణం పనుల కోసం సామాగ్రిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో స్లాబ్ సామాగ్రిని మోసుకెళ్లే క్రేన్ లిఫ్ట్ బకెట్ కూలింది. అక్కడే ఉన్న ఉపాధ్యాయురాలిపై లిఫ్ట్ బకెట్ పడడంతో ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థలాన్నీ పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది : హోం మంత్రి
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం రాజానగరం ప్రభుత్వ పాఠశాల ప్రమాద వార్త తెలియగానే ఉపాధ్యాయురాలు జ్యోష్నా బాయి మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతి కి గురిచేసిందని హోం మంత్రి అనిత అన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రకటించారు.






