- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Visakha Metro: విశాఖ మెట్రో.. మరో అడుగు
విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు (Metro Rail Project) నిర్మాణంపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

టెండర్లకు సంబంధించి ప్రీబిడ్సమావేశం
హాజరైన 28 దేశీయ, విదేశీ కన్సల్టెన్సీల ప్రతినిధులు
మూడు కారిడార్లుగా విశాఖ మెట్రో
దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు (Metro Rail Project) నిర్మాణంపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.ఇప్పటికే ప్రాజెక్ట్ ప్లానింగ్, టెండర్ల ప్రక్రియ, పనుల పర్యవేక్షణ, ప్రాజెక్ట్ పూర్తి కి కన్సల్టెన్సీ ఎంపిక కోసం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ టెండర్లను పిలిచింది. టెండర్లకు సంబంధించి ఈ రోజు విశాఖలో ప్రీబిడ్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి హాజరైన మొత్తం 28 దేశీయ, విదేశీ కన్సల్టెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. నేరుగా సమావేశానికి 14 సంస్థలు, ఆన్లైన్లో 8 సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. టెండర్లు (Tenders) దాఖలు చేసేందుకు జూన్ 8 వరకూ గడువు ఉంది. జూన్ 9 వ తేదీన టెండర్లు ఓపెన్ చేసి కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు. కన్సల్టెన్సీ ఎంపిక తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణం ఊపందుకోనుంది. వచ్చే మూడేళ్లలో విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగా వేగంగా అడుగులు వేస్తోంది. టెండర్ల ప్రక్రియ ఖరారు కాగానే ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్ని కేంద్రం నుంచి తీసుకు రావాలని భావిస్తోంది.
విశాఖ మెట్రోకు మొత్తం నిధులు కేంద్రమే సమకూర్చాలని, రాష్ర్టం ప్రభుత్వం అదే విధంగా విన్నవించాలని అనుకుంటోంది. ఈ ప్రాజెక్టు తొలి దశ అమలుకు రూ.11,498 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. మెట్రో రైలుకు సంబంధించి మొత్తం 99.75 ఎకరాలు అవసరం అవుతుందని, భూ సేకరణకు మరో రూ.882 కోట్లు అవసరమన భావిస్తున్నారు. విశాఖలో మొదట మూడు కారిడార్లు నిర్మించాలని ప్రతిపాదించారు. మొదటి కారిడార్46.23 కిలోమీటర్ల పొడవు, రెండో కారిడార్ 5.07 కి.మీ. పొడవు, మూడో కారిడార్6.75 కి.మీగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎటువంటి హామీ లేకపోయినా.. కేంద్రంతో ఉన్న సత్పంబంధాలతో పూర్తిగా సహకరిస్తుందని భావిస్తున్నారు.






