- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Visaka | నేటితో మార్గశిర మహోత్సవాలు సంపూర్ణం
విశాఖపట్నంలోని (Visakapatnam) బురుజుపేటలో కొలువుదీరిన కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో (Kanaka Mahalakshmi Temple) నేటితో మార్గశిర మహోత్సవాలు సంపూర్ణం కానున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నంలోని (Visakapatnam) బురుజుపేటలో కొలువుదీరిన కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో (Kanaka Mahalakshmi Temple) నేటితో మార్గశిర మహోత్సవాలు సంపూర్ణం కానున్నాయి. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా అత్యంత భక్తి శ్రద్దలతో మార్గశిర మహోత్సవాలను నిర్వహహించారు. నవంబరు 21న ప్రారంభమైన ఈ ఉత్సవాలు నేటితో సమాప్తం కానున్నాయి. ఉత్సవాల చివరి రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయానికి వరుస కట్టారు. శుక్రవారం భారీ ఎత్తున తరలివచ్చిన మహిళా భక్తులు అమ్మవారికి సారెలను సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఈఓ శోభారాణి మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశామన్నారు. రద్దీ దృష్ట్యా ప్రత్యేక ప్రసాదం కౌంటర్లను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా వేద సభలు, అన్నదానం, హోమాలు వంటి కార్యక్రమాలు జరిగాయన్నారు. పోలీసులు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును నిర్విస్తున్నట్లు తెలిపారు. భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకోవాలని.. ఎటువంటి హడావుడికి పాల్పడొద్దని కోరారు. ప్రజలందరికీ కనకమహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు.






