- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్ : సంక్రాంతి రాగానే ఏపీలో కోడి పందాలు గుర్తు వస్తాయి. ముఖ్యంగా జిల్లాల్లో మామూలు హడావుడి ఉండదు. నిర్వాహకులు కోడి పందాల మాటున జూదం ఆడించేస్తుంటారు. ఇక్కడ ఓడలు బళ్లు.. బళ్లు ఓడలవుతుంటాయి. డబ్బులు పోగొట్టుకునే వారు కొందరైతు, పొందేవారు ఇంకొందరు. మొత్తానికి ఇక్కడ లాభం మాత్రం దండుకునేది నిర్వాహకులే. అది వెయ్యి, రెండు వేలు కాదు. ఏకంగా లక్షలు, కోట్లలోనే లెక్కలు మారిపోతుంటాయి. అందుకే కోడి పందాలకు మామూలూ డిమాండ్ ఉండదంటారు కొందరు. అసలు కోడి పందాలు ఏ స్థాయిలో జరుగుతాయో నిరూపించే ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విజయవాడ రూరల్ మండలం నున్న వికాస్ కాలేజీ రోడ్డులో వీడియో చిత్రీకరణ జరిగినట్లు దాన్ని పోస్టు చేసినవారు పేర్కొంటున్నారు. అయితే అందులో ఉన్నవారు మాట్లాడిన మాటలు మాత్రం భలే ఆసక్తికరంగా ఉన్నాయి.
అసలు వీడియోలో నీలి రంగు చొక్కా వేసుకున్న ఓ వ్యక్తి మాట్లాడుతూ.. నీళ్లెవరియ్యాలి.. మందెవరు పోయాలి అనే దానికి లెక్కలుంటాయి. మూడు రోజులు కోడి పందాలు పెట్టేదాం. మూడు రోజులకు కలిపి పది లక్షల రూపాయలు పోలీసు స్టేషనుకు ఇవ్వాలి. అయితే డబ్బులు ఇవ్వడమే కాకుండా ప్రతిరోజూ వెళ్లి పోలీసు స్టేషనులో కేసు కూడా కట్టించుకొని రావాలి. అయితే రాత్రి వేళ కోడి పందాలు నిర్వహిస్తామా? ఉదయం నిర్వహిస్తామా? లేక పొద్దున నుంచి సాయంత్రం 5 గంటల వరకే నిర్వహిస్తామా అనేది ఇంకా తేలాల్సి ఉందని నీలి రంగు చొక్కా వేసుకున్న వ్యక్తి అనడం వీడియోలో కనిపిస్తోంది. పోలీసు శాఖ వారికి ఇచ్చేది కాకుండా మీడియా, ఎక్సైజ్ అధికారులు, ఇతరులకు ఇచ్చేది అదనం అని అతను అందులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అంటే పందాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో వేరే చెప్పనక్కర్లేదు. వీడియో బయటపడింది కాబట్టి విషయం బయటకు పొక్కింది కానీ.. ఇలా బయటపడని వ్యవహారాలెన్నో. అయినా అన్ని సెట్టింగ్ చేసేశాక పండగలో పందాలు ఆగం సాధ్యమేనా.. వాటిని ఆపి నేతలు ఓట్లను కోల్పోయే ధైర్యం చేస్తారా? పండగపూట ఎవరి లాభం వారిది మరి.






