ఏపీ రాజధానిపై విజయసాయి రెడ్డి ట్వీట్

by velandi.Saikiran |   (  Updated:2026-04-07 13:47:54  IST  )

అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఆమోదించినందుకు గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలు తెలిపారు విజయసాయిరెడ్డి.

ఏపీ రాజధానిపై విజయసాయి రెడ్డి  ట్వీట్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర సర్కార్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఏపీ కీలక నాయకులు విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఆమోదించినందుకు గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలు తెలిపారు విజయసాయిరెడ్డి. అటు ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.

కుల మత జాతి భేదాలకు అతీతంగా రాజధాని కోసం అమరావతిలో మౌలిక సదుపాయాలను నిర్మించాలని కోరారు. ఈ నిర్ణయం తీసుకోవడం ఒక ఎత్తు అయితే, దానిని క్షేత్రస్థాయిలో అమలు చేయడం అసలైన సవాలు అంటూ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీని బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని.. సమర్థవంతంగా ముందుకు సాగించాలని కోరారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అమరావతిని నిర్లక్ష్యం చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో విజయ్ సాయి రెడ్డి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఇక అటు చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశంపై ఇప్పటికే స్పందించారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, అమరావతి రైతుల విజయమని పేర్కొన్నారు.

Next Story