అదంతా ఫేక్...విజయ సాయిరెడ్డి సంచలన పోస్ట్

by velandi.Saikiran |

వైసిపి పార్టీ ( YCP ) మాజీ నాయకులు విజయసాయిరెడ్డి ( Vijayasai reddy ) చేసిన మరో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదంతా ఫేక్...విజయ సాయిరెడ్డి సంచలన పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: వైసిపి పార్టీ ( YCP ) మాజీ నాయకులు విజయసాయిరెడ్డి ( Vijayasai reddy ) చేసిన మరో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాను వైయస్ జగన్మోహన్ రెడ్డికి ( Ys Jagan) కౌంటర్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ఓ పత్రిక ప్రకటన వైరల్ అవుతోందని.. అందులో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు విజయసాయిరెడ్డి. రెండు రోజుల కిందట మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పై వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తన రాజ్యసభ సీటును చంద్రబాబు నాయుడుకు అమ్ముకున్నాడని... విజయసాయిరెడ్డి పూర్తిగా మారిపోయాడని ఫైర్ అయ్యాడు జగన్.

అయితే జగన్ చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చినట్లు ఒక పత్రిక ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేను మారను.. నా వ్యక్తిత్వం ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది... అధికారం వచ్చిన తర్వాత నువ్వే మారావు అంటూ జగన్ పై ఫైర్ అయ్యాడు విజయ్ సాయి రెడ్డి. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో 30 ఏళ్లుగా అనుబంధం ఉంది.. కానీ నేను ఎక్కడ లొంగలేను.. ప్రలోభాలకు ఆశపడలేదు... అంటూ విజయసాయిరెడ్డి ప్రకటన విడుదల చేసినట్లు ఒక పోస్టు వైరల్ చేశారు. తాజాగా దీనిపై స్వయంగా విజయ సాయిరెడ్డి స్పందించారు.

నా పేరు మీద సర్కులేట్ అవుతున్న పత్రిక ప్రకటన విషయంలో మీడియాలో కొందరు మిత్రుల ద్వారా తెలిసింది అని ట్విట్ చేశారు విజయ సాయి రెడ్డి. ఆ ప్రకటన నాది కాదు... నేను చేసిన అలాగే చేయబోయే పత్రిక ప్రకటనలు నా అధికారిక X ఖాతా ద్వారానే మాత్రమే చేస్తా.. గమనించండి అంటూ మీడియాను రిక్వెస్ట్ చేశాడు విజయ సాయి రెడ్డి. దీంతో విజయసాయిరెడ్డి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.


Next Story