అభిమానంతోనే విగ్రహ నిర్మాణం.. ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా నవరత్నాలు

by Disha Web Desk 3 |
అభిమానంతోనే విగ్రహ నిర్మాణం.. ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా నవరత్నాలు
X

దిశ వెబ్ డెస్క్: వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అతి పెద్ద అంబేద్కర్ విగ్రహా నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి అందరికీ సుపరిచితమే. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, నేతలతో కలిసి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి విగ్రహ పరిశీలనకు వెళ్లారు. ఈ నేపథ్యంలో విగ్రహాన్ని పరిశీలించిన విజయసాయి రెడ్డి విగ్రహ నిర్మాణంలో కొన్ని సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ పైన ఉన్న అభిమానంతోనే 125 అడుగుల అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తున్నారని.. విగ్రహ ఆవిష్కరణ ఈనెల 19వ తేదీన విజయవాడలో జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరగనుందని వెల్లడించారు.

ఇక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదర్శాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలను రూపొందించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన నిర్మిస్తున్న ఈ విగ్రహం చరిత్రలో మహాశిల్పంగా నిలిచిపోతుంది అని హర్షం వ్యక్తం చేశారు. కాగా ఈ నెల 19వ తేదీన నిర్వహిస్తున్న విగ్రహావిష్కరణలో 20వేల మంది పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. విగ్రహ ఆవిష్కరణ రోజు సాయంత్రం డ్రోన్ షో నిర్వహిస్తామని తెలిపారు. రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు మార్గదర్శకుడని.. అలాంటి మహనీయ మార్గదర్శకుని కార్యక్రమానికి అందరూ తరలిరావాలని.. ఇలాంటి కార్యక్రమానికి ఆహ్వానం అవసరమా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.


Next Story