Vijayasai Reddy: విజయసాయి అమ్ముడుపోయాడు.. ఇవిగో ఆధారాలు..!

by Thanuru Gopichand |

విజయసాయి రెడ్డి .. చంద్రబాబుకు అమ్ముడు పోయాడంటూ అనడానికి ఆధారాలు ఇవిగో.. అంటూ ఓ సంచనల వీడియోను వైఎస్సార్ కాంగ్రెస్​పార్టీ విడుదల చేసింది.

Vijayasai Reddy: విజయసాయి అమ్ముడుపోయాడు.. ఇవిగో ఆధారాలు..!
X

సంచలన వీడియో విడుదల చేసిన వైసీపీ

టీడీపీ నేత జనార్ధన్​తో రహస్యంగా సమావేశం అయినట్లు ఆరోపణలు

ఇది నమ్మక ద్రోహం కాదా.. అంటూ ప్రశ్నలు

దిశ, డైనమిక్​ బ్యూరో: విజయసాయిరెడ్డి.. చంద్రబాబుకు అమ్ముడు పోయాడంటూ అనడానికి ఆధారాలు ఇవిగో.. అంటూ ఓ సంచనల వీడియోను వైఎస్సార్ కాంగ్రెస్​పార్టీ (YCP) విడుదల చేసింది. విజ‌య‌సాయిరెడ్డి అమ్ముడు పోయాడ‌ న‌డానికి ఇదే ప‌క్కా ఆధారాలు అంటూ తన ట్విట్టర్​ఖాతాలో పేర్కొంది. మ‌ద్యం కుంభ‌కోణంపై సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌ల ముందు ర‌హ‌స్య స‌మావేశం జరిగిందంటూ, తాడేప‌ల్లి పార్క్ విల్లాలో విల్లా నెం 27కు సాయంత్రం 5:49కు విజ‌య‌సాయిరెడ్డి, 13 నిమిషాల త‌ర్వాత అదే విల్లాకు చంద్రబాబు నమ్మిన బంటు టీడీ జనార్ధన్​(Janardhan) వచ్చారని తెలిపింది. అక్కడే 45 నిమిషాల పాటు ర‌హ‌స్య మంత‌నాలు సాగించినట్లు ఆ పార్టీ తెలిపింది. సీఐడీ విచార‌ణ ముగిసిన వెంట‌నే మీడియా ముందు విజయసాయిపై వైయ‌స్ జ‌గ‌న్‌పై (YS Jagan)విమర్శలు చేశారని పేర్కొంది. వైయ‌స్ జ‌గ‌న్ న‌మ్మి, దగ్గర పెట్టుకుని, పార్టీలో క్రియాశీల‌క ప‌ద‌వుల‌తో పాటు రాజ్యసభకు పంపించి గౌర‌విస్తే ఇంకా మూడేళ్లు ప‌ద‌వీ కాలం ఉన్నా చంద్రబాబుకు మేలు చేసేందుకు విజ‌య‌సాయిరెడ్డి రాజీనామా చేశారని మరోసారి ఆరోపణలు చేసింది. ఇది నమ్మక ద్రోహం కాదా? అని పేర్కొంది.

ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్​అవుతోంది. చీకటి మాటున దాగున్న నిజం.. రెండు గంటలకు బ్రేకింగ్​అంటూ ఆ పార్టీ ట్విట్టర్​అకౌంట్లో కొద్ది సేపటి కిందట ఓ పోస్టు చేశారు. ఆ తర్వాత పరిశోధనాత్మక కథనం అంటూ ఈ వీడియో ను విడుదల చేశారు. రెండు రోజుల కిందట మాజీ సీఎం జగన్​.. విజయసాయిపై చేసిన ఆరోపణల వీడియోను కూడా దీనికి జత చేశారు. అందులో విజయసాయి చంద్రబాబుకు అమ్ముడుపోయాంటూ జగన్​తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ కీలక నేతలో భేటీ అవడం ఇందుకు నిదర్శనం అంటూ వైసీపీ ఇప్పుడు వీడియోను విడుదల చేసింది. ఏపీలో లిక్కర్​స్కాం.. వైసీపీ పనిచేసిన కీలక నేతల మధ్య నిప్పు రాజేస్తోంది. ఈ కేసుకు సంబంధించి విజయసాయిరెడ్డిని సాక్షిగా విచారణకు పిలిపించారు. ఆ తర్వాత ఆయన జగన్​పై పలు ఆరోపణలు చేస్తూ వచ్చారు. రెండు రోజుల కిందట జగన్​చేసిన వ్యాఖ్యలకు విజయసాయి రిప్లై ఇవ్వలేదు. పైగా సోషల్ మీడియాలో ఇచ్చిన ప్రకటన కూడా తనది కాదంటూ ఆయన పేర్కొ న్నారు. ఈ క్రమంలో వైసీపీ ఓ వీడియో విడుదల చేయడం సంచలనం రేకెత్తింది. ఇప్పటికైనా జగన్​చేసిన ఆరోపణలకు ఆయన స్పందిస్తారో లేదో చూడాలి.

Next Story