Video Viral: కాశీ వీధుల్లో Minister Roja.. రిక్షాలో ప్రయాణం

by Disha Web Desk 16 |
Video Viral: కాశీ వీధుల్లో Minister Roja.. రిక్షాలో ప్రయాణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి, ఫైర్ బ్రాండ్ ఆర్‌కే రోజా రాజకీయాల్లో ఆమె రూటే సెపరేటు. సినిమాల్లో హీరోయిన్‌గా చేసేటప్పుడు ఏ పాత్రలోనైనా ఆమె ఒదిగిపోయేది. అలానే రాజకీయాల్లో కూడా ఎలాంటి అవకాశం వచ్చినా అందుకు సంబంధించిన పాత్రల్లో కనిపిస్తూ హల్‌చల్ చేస్తుంటారు. ఒక అంబులెన్స్ ప్రారంభిస్తే అంబులెన్స్ డ్రైవర్‌గా.. బైక్ రైడర్‌గా..మగ్గం నేస్తూ, క్రీడాకారురాలిగా ఇలా అనేక అవతారాలు ఎత్తుతుంటారు. ఇవన్నీ ఒక ఎత్తైతే రోజా అకస్మాత్తుగా రిక్షాలో ప్రయాణిస్తున్న ఓ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. తన ఫ్రెండ్‌తో కలిసి రోజా రిక్షాలో ప్రయాణిస్తూ చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఈ వీడియోను మంత్రి ఆర్‌కే రోజాయే తన సోషల్ మీడియా వేదికగా అప్‌లోడ్ చేశారు.

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆమె ప్రముఖ ఆధ్యాత్మిక నగరం వారణాసిలో పర్యటించారు. కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. పవిత్ర గంగానది హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి ఆర్‌కే రోజా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

Also Read...

శివరాత్రి రోజు విషాదం..పట్టిసీమ వద్ద గోదావరిలో ముగ్గురు గల్లంతు

Next Story

Most Viewed