నేను ఆత్మహత్య చేసుకుంటా.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు మరో వీడియో

by Ajay Maddhiboyina |

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై బాధితురాలు వరుస వీడియోలు రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే రోజుకో వీడియో వదిలిన వీణ తాజాగా మరో వీడియోను రిలీజ్ చేసింది.

నేను ఆత్మహత్య చేసుకుంటా.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు మరో వీడియో
X

దిశ, వెబ్ డెస్క్: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై బాధితురాలు వరుస వీడియోలు రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే రోజుకో వీడియో వదిలిన వీణ తాజాగా మరో వీడియోను రిలీజ్ చేసింది. వీడియోలో ఆమె మాట్లాడుతూ.. తాను బయటకు వచ్చి నెల రోజులు అవుతోందని చెప్పింది. ఈ నెల రోజులలో తనకు ఏం న్యాయం జరిగిందని ప్రశ్నించింది. జనసేన కమిటీ వేసిందని ఆ కమిటీ ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదన్నారు. ఎఫ్ఐఆర్ నమోదైందని, తనపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అని బయటకు వస్తే ఒక్కడు కూడా ముందుకు రావడంలేదా అని మండిపడ్డారు. అంటే అన్యాయం జరినట్టేనా అని ప్రశ్నించారు.

అధికారపార్టీ అనే పట్టించుకోవడంలేదా అని అన్నారు. పార్టీకి సంబంధం లేదు అంటున్నారు..పార్టీ అధికారం ఇవ్వడం వల్లే శ్రీధర్ ఎమ్మెల్యే అయ్యాడని తెలిపింది. శ్రీధర్ సర్పంచ్ గా ఉన్నప్పుడు అసలు ఎవరో కూడా తెలియదు అని చెప్పింది. శ్రీధర్ ఇచ్చిన ధైర్యంతో ఎంత దారుణం చేసినా తాను నమ్మానని ఆవేదన వ్యక్తం చేసింది. పల్లెటూరులో పుట్టినవాడు అన్యాయం చేయడు కదా అని నమ్మి మోసపోయానని తెలిపింది. ప్రభుత్వంపై నమ్మకంతో తాను బయటకు వచ్చానని అలా వస్తే హనీట్రాప్, రాజకీయ కుట్ర అంటూ ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కాళ్లు పట్టుకుని అడిగినా నెలరోజుల నుండి ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పింది.

అధికారంలో ఉన్నవాళ్లు న్యాయం చేయపోతే ప్రతిపక్షం సాయం కోరడంలో తప్పేంటని ప్రశ్నించింది. పోలీస్ వ్యవస్థ, అధికారంలో ఉన్నవాళ్లు ఏం న్యాయం చేశారని ప్రశ్నించింది. తప్పు చేసిన శ్రీధర్ ఊర్లో క్రికెట్ ఆడుకుంటున్నాడని.. తాను మాత్రం ఒంటరి అయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. తప్పు చేసిన వాళ్లనే ఎంకరేజ్ చేస్తారా అంటూ పవన్ కల్యాణ్ ను ప్రశ్నించింది. నెల రోజుల నుండి తన వెంట ఎవరూ లేరని ఒంటరిగానే తిరుగుతున్నానని చెప్పింది. అధికార పార్టీ మహిళలకు తోడు ఉందని నిరూపించుకోవాలని చెప్పింది. దయచేసి పవన్ కల్యాణ్ తనకు న్యాయం చేయాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేసింది.

Next Story