Vasireddy Padma: వైసీపీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా.. జగన్ పై ఘాటు విమర్శలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2024-10-23 05:46:02  IST  )

ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా జగన్ పై ఆమె ఘాటు విమర్శలు చేశారు.

Vasireddy Padma: వైసీపీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా.. జగన్ పై ఘాటు విమర్శలు
X

దిశ, డైనమిక్​బ్యూరో: పార్టీని నడిపించడంలో జగన్ కు బాధ్యత లేదు. పరిపాలన చేయడంలో బాధ్యత లేదు. సమాజం పట్ల అంతకన్నా బాధ్యత లేదు.. అంటూ ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma Resign) తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు వైయస్ఆర్ సీపీకి రాజీనామా చేస్తున్నట్లు మీడియా ద్వారా తెలియశారు. ‘పార్టీలో కష్టపడిన వారి కోసం ఇప్పుడు జగన్ గారు ‘గుడ్ బుక్’, ప్రమోషన్లు అంటున్నారు. నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది ‘గుడ్ బుక్’ కాదు “ గుండె బుక్ ”. వారికి ప్రమోషన్ పదం వాడటానికి రాజకీయపార్టీ వ్యాపార కంపెనీ కాదు. జీవితాలు, ప్రాణాలు పెట్టిన కార్యకర్తలు అవసరం లేదు అనుకునే జగన్ గారు ‘గుడ్ బుక్’ పేరుతో మరోసారి మోసం చెయ్యడానికి సిద్ధపడుతున్నారు..’ అని ఆమె ఆరోపించారు. అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణులు ఉన్న నాయకుడుని ప్రజలు మెచ్చుకోరని ఈ ఎన్నికల తీర్పు స్పష్టం చేసిందన్నారు. వ్యక్తిగతంగా, విధానాలపరంగా అనేక సందర్భాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఒక నిబద్ధత కలిగిన నాయకురాలిగా పార్టీలో పనిచేశాను. ప్రజాతీర్పు తర్వాత అనేక విషయాలు సమీక్షించుకుని అంతర్మథనం చెంది వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

Next Story