ఏపీకి మ‌రో శుభ‌వార్త‌..ఇక‌పై అక్క‌డి వ‌ర‌కు వందే భార‌త్ స‌ర్వీస్‌ !

by velandi.Saikiran |

విజయవాడ తర్వాత గుడివాడ, భీమవరం టౌన్ మీదుగా నరసాపురం వరకు వెళ్లనుంది వందే భార‌త్ స‌ర్వీస్‌.

ఏపీకి మ‌రో శుభ‌వార్త‌..ఇక‌పై అక్క‌డి వ‌ర‌కు వందే భార‌త్ స‌ర్వీస్‌ !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు అలర్ట్. వందే భారత్ ట్రైన్ల రాకపోకలపై సదరన్ రైల్వే కీలక ప్రకటన చేసింది. చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ ట్రైన్ ఇకపై నరసాపురం వరకు కొనసాగనుంది. గతంలో విజయవాడ వరకే ఈ వందే భారత్ నడిచేది. కానీ ఇక నుంచి విజయవాడ తర్వాత గుడివాడ, భీమవరం టౌన్ మీదుగా నరసాపురం వరకు వెళ్లనుంది. జనవరి 12వ తేదీ అంటే సంక్రాంతి సమయానికి నరసాపురం వరకు ఈ వందే భారత్ రైలు సర్వీస్‌ ప్రారంభం కానుంది.

ఈ మేరకు బుధవారం సదరన్ రైల్వే అధికారిక ప్రకటన చేసింది. సర్వీస్ పొడిగించిన తర్వాత, ఉదయం 5:30 గంటలకు చెన్నై సెంట్రల్ లో వందే భారత్ ట్రైన్ ప్రారంభమవుతుంది. అలా బయలుదేరిన వందే భారత్ విజయవాడ వచ్చేసరికి ఉదయం 11:40 గంటలవుతుంది. ఇక మధ్యాహ్నం 2:10 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2:50 గంటలకు నరసాపురంలో బయలుదేరి, రాత్రి 11:45 గంటలకు చెన్నై చేరుకుంటుంది ఈ వందే భారత్ రైలు.




Next Story