కర్నూలు బస్సు ప్రమాదం.. బైక్‌ను ఢీ కొట్టి 300 మీటర్లు ఈడ్చుకెళ్లిన బస్సు

by Naga Rani Yarlagadda |

కర్నూల్ జిల్లాలో వి. కావేరీ బస్సు ప్రమాదానికి గురికాగా.. ఈ ప్రమాదం ఘోర విషాదాన్ని మిగిల్చింది.

కర్నూలు బస్సు ప్రమాదం.. బైక్‌ను ఢీ కొట్టి 300 మీటర్లు ఈడ్చుకెళ్లిన బస్సు
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూల్ జిల్లాలో వి. కావేరీ బస్సు ప్రమాదానికి గురికాగా.. ఈ ప్రమాదం ఘోర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదంలో 20 మంది మరణించగా.. మృతుల కుటుంబాలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలుగు రాష్ట్రాల మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కాగా.. ఈ ప్రమాదానికి కారణం బైక్ ఢీ కొట్టడమేనని పోలీసులు ప్రాథమిక నిర్థారణను వచ్చారు.బస్సు ప్రమాదానికి గురైన వెంటనే ఇద్దరు డ్రైవర్లు పరారవ్వగా.. రెండో డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు బైక్ ను ప్రజానగర్ సమీపంలో ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బైక్ ఢీ కొట్టిన తర్వాత 300 మీటర్ల వరకూ దానిని బస్సు లాక్కెళ్లిందని, ప్రమాదంలో కర్నూల్ జిల్లా బి. తాండ్రపాడుకు చెందిన శివశంకర్ (23) మృతి చెందాడని వెల్లడించారు. బైక్ ను ఈడ్చుకెళ్లడంతో రాపిడికి పెట్రోల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగగా.. అవి బస్సు ఇంధన ట్యాంకర్ కు వ్యాపించాయని, ఫలితంగా బస్సంతా దగ్ధమైందని వివరించారు.

Next Story