మోహన్ బాబు యూనివర్సిటీలో దారుణం..కులం పేరుతో దూషించి విద్యార్థిపై దాడి

by Ajay Maddhiboyina |

తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. కులం పేరుతో దూషించి విద్యార్థిని దారుణంగా కొట్టారు.

మోహన్ బాబు యూనివర్సిటీలో దారుణం..కులం పేరుతో దూషించి విద్యార్థిపై దాడి
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. కులం పేరుతో దూషించి విద్యార్థిని దారుణంగా కొట్టారు. కొద్దిరోజుల క్రితం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జేమ్స్ అనే విద్యార్థిని తన జూనియర్ యశ్వంత్ కులం పేరుతో దూషించాడు. తరచూ అవమానిస్తున్న యశ్వంత్‌ను జేమ్స్ మందలించాడు. దీంతో యశ్వంత్ కొందరు రౌడీ షీటర్లతో కలిసి జేమ్స్‌ను కిడ్నాప్ చేశాడు. తరవాత రౌడీ షీటర్లతో కలిసి జేమ్స్ ను చిత్ర హింసలు పెట్టారు.

ప్రస్తుతం జేమ్స్ చికిత్స తీసుకుంటుండగా ఓ సెల్ఫీ వీడియో ద్వారా తనపై దాడి జరిగిన విషయాన్ని గురించి చెబుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. రెండు రోజుల పాటూ తనను యశ్వంత్ మరియు రౌడీ షీటర్లు దారుణంగా కొట్టారని చెప్పారు. రూమ్ లో భందించి కత్తులతో పొడిచినట్టు చెప్పాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే డబ్బులు తీసుకుని సెటిల్మెంట్ చేయించుకోవాలని సూచించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తక్కువ కులం అంటూ దూషించి, నువ్వు మా జోలికి వస్తావా అంటూ దుస్తులు విప్పి దారుణంగా కొట్టారని చెప్పాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Next Story