అడ్డగోలుగా విమాన చార్జీలు పెంపు.. రామ్మోహన్ నాయుడు స్ట్రాంగ్ రియాక్షన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-06 11:54:39  IST  )

ఇండిగో సర్వీసులను రద్దతో విమాన చార్జీల పంపుపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు...

అడ్డగోలుగా విమాన చార్జీలు పెంపు.. రామ్మోహన్ నాయుడు స్ట్రాంగ్ రియాక్షన్
X

దిశ, వెబ్ డెస్క్: ఇండిగో(Indigo) విమాన సర్వీసులను రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గమ్యస్థానాలకు చేరుకోలేక ఆయా ఎయిర్‌పోర్టులో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఒక్కసారిగా వందల సంఖ్యలో విమానాలు రద్దుకావడంతో సీనియర్ సిటీజన్స్, విద్యార్థులు, వైద్య సాయం కోసం వెళ్తున్న ప్రయాణికులు నానా అవస్తలు పడుతున్నారు.

దీంతో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సీరియస్ అయ్యారు. ఓవైపు విమానాల రద్దు.. మరోవైపు రీఫండ్‌ జాప్యం జరగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు టికెట్ డబ్బులు ఆదివారం సాయంత్రంలోపే రీఫండ్ చేయాలని ఆదేశించారు. అలాగే ప్రయాణికులపై రీ షెడ్యూలింగ్ ఛార్జీలు పెంచొద్దని సూచించారు. ఎవరికి లగేజీలను వాళ్లను 24 గంటల్లోనే అప్పగించాలన్నారు. రీఫండ్‌లో జాప్యం జరిగినా.. తమ ఆదేశాలు పట్టించుకోకపోయినా కఠిన చర్యలు తప్పవని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశించారు.

ఇండిగో సర్వీసుల అస్తవ్యస్తం నేపథ్యంలో కొన్ని విమానయాన సంస్థలు చార్జీలు అడ్డగోలుగా చార్జీలు పెంచడంపై రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. అవకాశవాద ధరల విధానాలతో ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తే సహించమని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై తక్షణ చర్యలు ఉంటాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

Next Story