BIG NEWS: లోక్ సభలో అమరావతి బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి

by Naga Rani Yarlagadda |

BIG NEWS: లోక్ సభలో అమరావతి బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: అమరావతి పునర్ వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు కాంగ్రెస్ ఎంపీలు మద్దతిచ్చారు. మార్చి 28న కూటమి ప్రభుత్వం అమరావతి చట్టబద్ధత బిల్లును తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. అనంతరం అమరావతి చట్టబద్ధతపై మాణిక్కం ఠాగూర్ ప్రకటన చేశారు. విభజన సమయంలో ఏపీకి అనేక హామీలిచ్చామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇంకా పెండింగ్ లోనే ఉందని, ఆ హామీను ఇంకా నెరవేర్చలేదని గుర్తుచేశారు. దీనిపై ప్రధాని మోదీ కూడా సభలో హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై మాట్లాడకుండా తాము మౌనంగా ఉండలేమన్నారు. హైదరాబాద్, బెంగళూరు తరహాలో అమరావతి కూడా అభివృద్ధి చెందాలన్నారు. అమరావతికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని, ఆ ప్రాంతానికి న్యాయం జరిగేంతవరకూ అండగా నిలుస్తామన్నారు. ఈ బిల్లుపై బీజేపీ నుంచి ఎంపీ పురంధేశ్వరి, జనసేన నుంచి ఎంపీ బాలశౌరి, వైసీపీ నుంచి ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడనున్నారు.

Next Story