- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దమ్ముంటే ఎదురుగా వచ్చి దాడి చేయండి: టీడీపీ తెలుగు మహిళ తేజస్విని సవాల్
అనంతపురం లక్ష్మీనగర్‌లో గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు....

X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం లక్ష్మీనగర్‌లో గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. టీడీపీ తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి తేజస్విని కారుపై దుండగులు రాళ్ల దాడి చేశారు. పార్క్ చేసిన కారును ధ్వంసం చేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. స్థానిక సీసీ ఫుటేజులను పరిశీస్తున్నారు. కాగా గతంలోనూ ఆమె కారుపై దుండగులు దాడి చేశారు. అయితే వైసీపీ కార్యకర్తలే ఈ పని చేశారంటూ ఆమె మండిపడ్డారు. తాజాగా కూడా తేజస్విని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేకే తన కారుపై దాడి చేశారని మండిపడ్డారు. ఆడ బిడ్డపై ఇంత దౌర్జన్యమా అని తేజస్వీని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. దమ్ముంటే ఎదురుగా వచ్చి దాడి చేయాలని సవాల్ విసిరారు.
Next Story






