- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News : వైజాగ్ లో ఊహించని ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్.. వీడియో వైరల్
వైజాగ్ లో అనుకోని ప్రమాదం జరిగి ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది.

దిశ, వెబ్ డెస్క్ : వైజాగ్ లో అనుకోని ప్రమాదం జరిగి ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఏపీ(AP)లోని విశాఖ(Vishakhapatnam)లోని సీతమ్మధార(Seethammadhara)లో చెట్టుకూలి అదే దారిలో వెళ్తున్న మహిళపై పడటంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. సీతమ్మధారలోని AMG ఆసుపత్రి ఎదురుగా ఉన్న రోడ్డులో పూర్ణిమ అనే మహిళ స్కూటీపై వెళ్తుండగా.. అంతలోనే అకస్మాత్తుగా రోడ్డు పక్కన గల చెట్టుకూలి(Tree Feller) పూర్ణిమపై పడింది. తలకు బలమైన గాయాలు కావడంతో ఆ మహిళ స్పాట్ లోనే కన్నుమూసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతురాలు MVP కాలనీ వాసురాలిగా గుర్తించారు. అయితే గాలిదుమారం, ఈదురు గాలులు, వర్షం లాంటివి లేకుండా సడన్ ఆ భారీ వృక్షం ఎలా కూలిందా అని స్థానికులు ఆశ్చర్య పోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.






