దేవుడి దర్శనానికి వెళ్లి ఇద్దరు గల్లంతు.. గాలింపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-30 05:28:48  IST  )

దేవుడి దర్శనానికి వెళ్లి ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయ్యారు...

దేవుడి దర్శనానికి వెళ్లి ఇద్దరు గల్లంతు.. గాలింపు
X

దిశ, వెబ్ డెస్క్: దేవుడి దర్శనానికి వెళ్లి ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయ్యారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా(Nellore District)సోమశిల అటవీ ప్రాంతం(Somashila forest area)లో జరిగింది. మనుబోలు మండలం నాయుడుపల్లి(Naidupally)కి చెందిన రత్నయ్య నాయుడు, సుబ్బారాయుడు వారం క్రితం మల్లంకొండ(Mallamkonda)లోని ఆలయానికి సోమశిల అటవీ ప్రాంతం నుంచి వెళ్లారు. అయితే ఆ తర్వాత వారి ఆచూకీ లేదు. ఫోన్లు సైతం స్విచ్ఛాఫ్ అయ్యాయి. ఇంటి నుంచి వారం రోజులు కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రత్నయ్య నాయుడు, సుబ్బారాయుడు కోసం సోమశిల అటవీ ప్రాంతంలో వెతుకుతున్నారు. తమ వారి ఆచూకీని గుర్తించేందుకు అటవీ పోలీసులు, సిబ్బంది సాయం చేయాలని కోరుతున్నారు.

Next Story