ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-14 11:58:26  IST  )

ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం కే సముద్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు...

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం కే సముద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. పోగాకు కోతలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరికొంతమంది సైతం గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. వాహనదారులు రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. డ్రంకెన్ డ్రైవ్ అసలు చేయకూడదన్నారు. అతిక్రమిస్తే చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

Next Story