- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap: విషాదం... ఒకే జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య
కర్నూలు జిల్లాలో ఇద్దరు రైతులు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్నారు..

దిశ, వెబ్ డెస్క్: దేశానికి అన్నం పెట్టే రైతులు ఓ వైపు తగ్గిపోతుంటే.. మరోవైపు ఉన్న వారిలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఆరుగాలం పంటలు పండించి పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో కొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇంకొందరు కొన్ని చెప్పుకోలేని కారణాలతో ఆయువు తీసుకుంటున్నారు. ఇలా రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో అన్నదాత కణికావేశంలో కనుమరుగై పోతున్నారు. తాజాగా ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. అది కూడా ఓకే జిల్లాలో జరగడం తీవ్ర విషాదాన్ని నింపాయి.
కర్నూలు జిల్లా దేవనకొండకు చెందిన లక్ష్మన్న రైతు. రోజు మాదిరి పొలానికి వెళ్లి వ్యవసాయం చేస్తారు. రోజూ మాదిరి ఈ రోజు కూడా లక్ష్మన్న పొలం పనులకు వెళ్లారని అనుకున్నారు. కానీ ఇంట్లో దూలానికి వేలాడుతూ ఆయన మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. లక్ష్మన్న ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. లక్ష్మన్న మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కర్నూలు జిల్లా గోనెగొండ్ల మండలంలోనూ అన్నదాత బలవన్మరణానికి పాల్పడ్డారు. పురుగులు మందు తాగి రైతు ఆంజనేయులు ఆత్మహత్య చేసుకున్నారు. కారణాలు తెలియదు కాదు.. ఆంజనేయులు మరణం ఆయన కుటుంబంలో తీవ్ర విషాదంలోకి నెట్టింది.






