Tragedy: కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి.. మరో ఆరుగురికి అస్వస్థత

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-27 16:16:37  IST  )

కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందగా మరో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు..

Tragedy: కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి.. మరో ఆరుగురికి అస్వస్థత
X

దిశ, వెబ్ డెస్క్: కలుషిత నీరు(Contaminated water) తాగి ఇద్దరు మృతి చెందగా మరో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నంద్యాల జిల్లా(Nandyala District) ఆత్మకూరు నీలితొట్ల వీధి(Atmakuru Nilihotla street)లో జరిగింది. మంచి నీళ్లు తాగిన కొద్దిసేపటికే పలువురు అస్వస్థత(Illness)కు గురయ్యారు. వాంతులతో తీవ్ర ఇబ్బదులు పడ్డారు. దీంతో వారిని అస్పత్రికి తరలించారు. అయితే వీరిలో ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

అయితే నీరు కలుషితం కావడంతోనే ఘటన జరిగినట్లు అధికారులు గుర్తించారు. నీలితొట్ల వీధిలో మెడికల్ శిబిరం ఏర్పాటు చేశారు. నీళ్లు తాగిన వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. మరోవైపు మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. మంచి నీళ్ల సరఫరా నిలిపివేశారు. స్థానికుల నుంచి నీటిని సేకరించి ల్యాబ్‌కు తరలించినట్లు సమాచారం. నీళ్లు కలుషితం ఎలా అయ్యాయనే దానిపై విచారణ మొదలు పెట్టారు. నీలితొట్లకు రోజు మాదిరిగానే వచ్చిన కుళాయి నీళ్లనే తాగారా..? లేదా మరేచోట నుంచి తెచ్చుకున్నారా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు.

Next Story