కర్నూలు బస్సు ప్రమాదంలో ట్విస్ట్‌.. బైకర్ శివశంకర్‌పై ఎర్రిస్వామి ఫిర్యాదు

by Kema Shiva Kumar |

కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో తాజాగా మరో బిగ్ ట్విస్ట్ చోటచేసుకుంది.

కర్నూలు బస్సు ప్రమాదంలో ట్విస్ట్‌.. బైకర్ శివశంకర్‌పై ఎర్రిస్వామి ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో తాజాగా మరో బిగ్ ట్విస్ట్ చోటచేసుకుంది. మరణించిన బైకర్‌ శివశంకర్‌పై అతడి స్నేహితుడు ఎర్రిస్వామి ఉలిందకొడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు 281, 125 (A), 106 (1) బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా ఎర్రిస్వామి తాను, శివశంకర్‌ కలిసి మద్యం చేవించినట్లుగా తెలిపాడు. నిర్లక్ష్యం వల్లే శివశంకర్ బైక్‌‌ను అతివేగంతో డివైడర్‌ను ఢీకొట్టినట్లు ఫిర్యాదులో ఎర్రిస్వామి వెల్లడించాడు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరం కింద పడిపోయాయని, కానీ శివశంకర్‌ తీవ్ర గాయాలతో స్పాట్‌లోనే మృతి చెందాడని తెలిపాడు. మృతదేహాన్ని పక్కకు తీసేందుకు ప్రయత్నించానని.. కానీ, అకస్మాత్తుగా ఇంతలోనే రోడ్డుపై పడిపోయిన బైక్‌ను ఓ వాహనం ఢీకొట్టగా రోడ్డు మధ్యలోకి వచ్చేసిందన్నాడు. ఆ తర్వాత వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు బైక్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిందని ఎర్రిస్వామి పోలీసుల ఎదుట సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

Next Story