లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రచారం..టీటీడీ వార్నింగ్

by Ajay Maddhiboyina |

తిరుమల లడ్డూ ప్రసాదంపై సోషల్ మీడియా అసత్య ప్రచారం జరుగుతోందని టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నవీన్ కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఖండించింది.

లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రచారం..టీటీడీ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్:తిరుమల లడ్డూ ప్రసాదంపై సోషల్ మీడియా అసత్య ప్రచారం జరుగుతోందని టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నవీన్ కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఖండించింది.అవన్నీ అసత్య ప్రచారాలని స్పష్టం చేసింది. జూన్ 8న స్వామివారి లడ్డూ ప్రసాదం తినేటప్పుడు నోటిలో గాయం అయ్యిందని నవీన్ కుమార్ ఆరోపించారు.

దీంతో అతడిని టీటీడీ సిబ్బంది అంబులెన్స్‌లో అశ్విని ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం స్విమ్స్ ఆస్పత్రికి తరలించి అక్కడ కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా సదరు వ్యక్తి లడ్డూ తింటూ నాలుక కొరుక్కోవడం వల్ల చిన్న గాయం అయ్యిందని నిర్దారించారు. దీనిపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ నుండి నష్టపరిహారం పొందాలనే దురుద్దేశంతోనే లడ్డూపై అసత్య ప్రచారం చేశాడని టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడి ఆరోపణలను ఖండిస్తున్నామని, లడ్డూపై అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Next Story