- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల అన్నప్రసాదం ట్రస్ట్‌కు భారీ విరాళం
టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ. 27 లక్షలు విరాళం అందాయి.

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక మండలి అన్న ప్రసాదాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 40 సంవత్సరాలుగా ఈ నిత్యాన్నదాన పథకం కొనసాగుతోంది. ఇక ఈ అన్న ప్రసాద పథకానికి భక్తుల నుంచి భారీ స్థాయిలో విరాళాలు అందుతున్నాయి. తాజాగా టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ. 27 లక్షలు విరాళం అందాయి. క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిసి కర్ణాటక రాష్ట్రం బెలగావికి చెందిన దాతలు విరాళం అందజేశారు. ఇందులో ప్రవీణ్ సుభాష్ సోన్ వాల్కర్ రూ. 17 లక్షలు ఇవ్వగా, సుభాష్ రావజప్పా సోన్ వాల్కర్ రూ. 10 లక్షలు విరాళమిచ్చారు.
టీటీడీ ట్రస్ట్ కు భారీగా విరాళాలు
నిత్యం తిరుమల శ్రీవారికి సంబంధించిన నిత్యాన్నదాన పథకానికి నిత్యం భక్తులు కోట్లల్లో విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో అన్న ప్రసాదం ట్రస్ట్ మూల నిధి రూ.2553 కోట్లకు చేరింది. భక్తులు కూడా ఒక్కరోజు అన్నప్రసాద వితరణ పథకంలో విరాళం కూడా అందించవచ్చు. ఒక్కరోజు పూర్తిగా అన్నప్రసాద వితరణకు రూ. 44 లక్షలు చెల్లించవచ్చని చెబుతున్నారు అధికారులు.






